బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలైన తర్వాతే ... స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

MLC Kalvakuntla Kavitha

  • కేంద్రం పేరు చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం దాట వేసే ప్రయత్నం చేస్తోంది
  • సుప్రీం కోర్టు తీర్పు మేరకు, 3 నెల్లకు మించి రాష్ట్రపతి బిల్లు ఉంచుకో కూడదు  
  • ఈ నెల 17న జరిపే రైల్ రోకోతో కేంద్రానికి సెగ తగలాలి
  • ఏపీలో కలిపిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేయాలి
  • జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  

రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మం వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఈ మేరకు హామీ ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీపై తాము ఒత్తిడి చేస్తే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపిందని చెప్పారు. ఇప్పుడు డిల్లీ నుండి బిల్లు రావాలని దాట వేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కేంద్రం కూడా ఈ బిల్లును వెంటనే ఆమోదించి పంపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి వద్ద 3 నెల్లకు మించి ఏ బిల్లు పెట్టుకోవద్దని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందని, ఆ తీర్పును గౌరవించి, బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు. కొత్తగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్ర రావు కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేలా చూడాలన్నారు. ఆయన మొదటి పని ఇదే కావాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, తాము ఈ నెల17న రైల్ రోకో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆందోళనలో భాగంగా రాష్ట్రం నుండి ఒక్క రైలు కూడా డిల్లీ వెళ్లకుండా చేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వానికి సెగ తగులుతుందన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు వున్నప్పటికీ, ప్రజల సమస్యలేవీ పరిష్కారం కావడం లేదన్నారు. గోదావరి జలాలను బనకచర్లకు తరలింపుపై జిల్లా మంత్రులు నోరు మెదపక పోవడం శోచనీయమన్నారు. ఏపీలో కలిపిన భద్రాచలం చుట్టూ ప్రక్కల గల 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. తమ ఒత్తిడి మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వినతి పత్రం ఇచ్చారని చెప్పారు. ఈ 5 గ్రామాలను తిరిగి కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు తమ పూర్తి మద్దతు వుంటుంటుందని తెలిపారు. అసలు తెలంగాణలోని మండలాలను ఏపీలో కలపడం ఆర్టికల్ 3కి విరుద్దమన్నారు. కేంద్రం వెంటనే ఈ గ్రామాలను తెలంగాణలో కలపక పోతే, పోరాటం తప్పదని కవిత ఈ సందర్భంగా హెచ్చరించారు.  


MLC Kavitha, Khammam

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి